లవర్స్ క్లబ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీష్ చందర్, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ‘లవర్స్ క్లబ్’ రూపొందుతుంది. ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి ధృవశేఖర్ దర్శకుడు. భరత్ అవ్వారి నిర్మాత. చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత భరత్ అవ్వారి మాట్లాడుతూ చిన్న చిత్రాల మనుగడకు మంచిమార్గం ఏర్పడటంతో చిత్రాన్ని ధైర్యంగా విడుదల చేస్తున్నామన్నారు. పక్కా ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. ప్రేమికులకు అండగా నిలబడే యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తే, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఫస్ట్ టైం ఐఫోన్ టెక్నాలజీతో సినిమా చిత్రీకరించామని దర్శకుడు ధృవశేఖర్ తెలిపారు. చిత్రం భాషా, వైజాగ్ ప్రసాద్, అజయ్త్న్రం, ధీరజ్ తదితరులు నటించిన చిత్రానికి సంగీతం రవి నిడమర్తి, కెమెరా డివిఎస్ ప్రకాశ్‌రావు.