రోబో-2 వాయిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోబో చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం రోబో-2. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీ హీరోగా చేస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అభిమానులను నిరాశపరిచే విధంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని ఈరోజు వార్తలు వచ్చాయి. తమిళ మీడియా ఈ చిత్రం వాయిదా పడినట్టు తెలిపింది. కానీ ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ వార్తల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించారు. ఈ చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు. ముందుగా అనుకున్న విధంగానే ఈ చిత్రం 25 జనవరి 2018న విడుదలవుతుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్, రజనీకాంత్‌ల షూటింగ్ పూర్తయింది. అత్యంత కీలకమైన గ్రాఫిక్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.