హేయ్ ..పిల్లగాడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సాయిపల్లవి కథానాయికగా, మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం హేయ్.. పిల్లగాడా. మలయాళంలో కలిగా విడుదలైన చిత్రాన్ని తెలుగులో డి.వి.కృష్ణస్వామి అనువదించారు. లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ పతాకంపై అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ తాహిర్ దర్శకుడు. చిత్రానికి సంబంధించిన సినిమా లోగోను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేసారు ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి నటించిన సినిమా తమిళం, మలయాళంలో పెద్దవిజయం సాధిస్తుందని తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని అన్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయని, హీరోకు హేమచంద్ర డబ్బింగ్ చెప్పారని రచయిత భాషాశ్రీ అన్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా తెలుగుప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతోపాటుగా యాక్షన్ పార్ట్ కూడా వుంటుందని తెలిపారు. టిపికల్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత డి.వి.కృష్ణస్వామి చెప్పారు. యువతకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమాకు అందరు ఫిదా అవుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సురేంద్ర కృష్ణ, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భాషాశ్రీ, పాటలు: సురేంద్ర కృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, నిర్మాత: డి.వి.కృష్ణస్వామి, దర్శత్వం: సమీర్ తాహెర్.