‘హలో గురు’-అఖిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ విషయంలో అనేక ఊహాగానాలు నెలకొని వున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నినే్న విడుదల చేసారు. కానీ సినిమా టైటిల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. కాగా నాగార్జున కొద్ది సేపటి క్రితమే ఈ చిత్ర టైటిల్ విషయంలో ట్విట్టర్‌లో హింట్ ఇచ్చారు. నాగ్, అమల నటించిన ‘నిర్ణయం’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘హలో గురు ప్రేమకోసమే జీవితం’ పదాలలో దాగుందని తెలిపాడు. దీనితో అభిమానులు వారికి తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘హలో గురు’ మరియు ‘ప్రేమకోసమే జీవితం’ ఈ రెండింటిలో ఏదో ఒకటి టైటిల్ అయి వుంటుందని ఊహిస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘హలో’ అనే టైటిల్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.