తారామణి సెనే్సషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘తారామణి’. ఆగస్టు 11న తమిళనాట విడుదలైన ‘తారామణి’ చిత్రం సెనే్సషన్ హిట్ అయింది. సినిమా టేకింగ్ కొత్తగా వుండడం, ప్రస్తుతం యువత టెక్నాలజీ కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది అనే విషయాలు అందరికీ కనెక్టు కావడంతో సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులే కాకుండా సినీ విమర్శకులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని ‘తారామణి’ పేరుతో డివి సినీ క్రియేషన్స్ బానర్‌పై డి.వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డివి సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేశ్ మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథ, ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా తమిళనాట బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. కాంటెంపరరీ పాయింట్‌తో దర్శకుడు రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది, ఈ సినిమా ట్రైలర్‌ను యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విడుదల చేయగా పాటలను సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేసారు. ప్రారంభంనుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా అందరి అంచనాలను మించి భారీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాం. అనువాద కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేసి ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.