అప్పుడే అనుకున్నాడట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు చేసిన ‘స్పైడర్’ సినిమాకోసం ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువైంది. దక్షిణాది స్టార్ డైరక్టర్లలో ఒకరైన మురగదాస్ డైరక్టు చేయడంవల్ల చిత్రానికి ఎనలేని క్రేజ్ దక్కింది. ప్రస్తుతం చివరి పాట షూటింగ్ దశలో వున్న చిత్రాన్ని తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇంతలా సినిమాను తమిళంలో విడుదల చేయడం వెనక ఇన్నాళ్లు మహేష్ స్ట్రాటజీ మాత్రమే ఉందనుకున్నారు. అయతే, మురగదాస్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను పదేళ్ల క్రితమే మహేష్‌తో సినిమా చేయాలనుకున్నా. కానీ నాకున్న కమిట్‌మెంట్స్ వల్ల కుదరలేదు. అంతేకాక నా సినిమాలన్నీ తమిళంతోపాటు హిందీ, తెలుగులోనూ అనువాదం అవుతున్నాయ. అందుకే ఈసారి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేయాలనుకుని రెండు భాషలు మాట్లాడే హీరో కావాలనుకునే మహేశ్‌ను సంప్రదించాను. అతను కూడా ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.