సినిమా మధురమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ అందమైన దృశ్యకావ్యంగా అల్లుకున్న కథతో రూపొందించిన ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ చిత్రం నాకు డెబ్యూ మూవీ అయినా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెస్తుందన్న నమ్మకం వుంది. సినిమా మాత్రం ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చుతుంది. ఓ రకంగా ఈ చిత్రం అంతా మధురమే అని చెబుతా అంటున్నాడు కొత్త కథానాయకుడు చంద్రకాంత్. గోవర్థన్.జి స్వీయ దర్శకత్వంలో రఘురామ్ రొయ్యూరుతో కలిసి సంయుక్తంగా థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రాధికా మెహరోత్రా హీరోయిన్‌గా రూపొందించిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. స్పందన బాగా వస్తోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇంకా చిత్ర విశేషాలను కథానాయకుడు చంద్రకాంత్ తెలుపుతూ- ఓ మంచి చిత్రంతో తాను పరిచయం అవ్వడం ఆనందాన్నిస్తోందని, తాను పుట్టి పెరిగి ఇంజనీరింగ్ పూర్తిచేసినది అంతా హైదరాబాద్‌లోనేనని తెలిపారు. నటుడిగా మారాలనుకున్న తరువాత అమెరికాలో శిక్షణ తీసుకున్నానని, ఈ చిత్రంలో రాధిక, పల్లవి బాగా నటించారని ఆయన అన్నారు. తొలి చిత్రంతోనే తనికెళ్ల భరణి, తులసి వంటి సీనియర్ నటులతో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని, ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకం వుందని అన్నారు. జెమిని సురేష్, పల్లవి డోరా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:శ్రీనివాస్ తోట, సంగీతం:జితిన్ రోషన్, కెమెరా:మనోజ్‌రెడ్డి, రచన, దర్శకత్వం:గోవర్థన్.జి.

చిత్రం..చంద్రకాంత్