బాలీవుడ్‌నూ ఫిదా చేస్తారట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే వుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాస్త గ్యాప్ తరువాత తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల మార్కెట్‌ను దాటి దూసుకుపోతోంది. వరుణ్‌తేజ్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారట. ఫిదా తెలుగులో సాధించిన ఘనివిజయంతో ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ రేటుకు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అడిగారట. త్వరలోనే ఈ రీమేక్ సెట్స్‌పైకి రానుందని.. తెలుగులో తెలంగాణ నేపథ్యంలో.. అదే యాసతో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్‌లో పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిస్తారట. అన్నట్టు ఈ హిందీ రీమేక్‌లో కూడా సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట? ఈ సినిమాకు మరి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది తెలియాల్సి వుంది. సో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.