రైట్ రైట్ రెండో షెడ్యూల్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.కృష్ణవంశి రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ, తొలి షెడ్యూల్‌ను అరకు, ఒడిసాలో చిత్రించారని, రెండో షెడ్యూల్‌ను వికారాబాద్ ఫారెస్ట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించామని తెలిపారు.
మూడో షెడ్యూల్‌ను ఈనెల 20 నుండి మార్చి 5 వరకు షూటింగ్ చేస్తే ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుందని, పాటలను ఔట్‌డోర్‌లో చిత్రీకరించనున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ‘బాహుబలి’ ప్రభాకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారని ఆయన తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగు నేటీవిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించామని, ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సులో జరిగే కథా కథనమంతా చిత్రంలో సాగుతుందని తెలిపారు. లవ్, కామిడీ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, జీవా, రాజారవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్, పావని, వినోద్, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:జె.బి., పాటలు:శ్రీమణి కెమెరా:శేఖర్, వి.జోసఫ్, మాటలు:డార్లింగ్ స్వామి, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం:మను.