మెగా ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు దర్శకుడు మారుతి. చిన్న చిత్రాల దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మారుతి, ఈ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతికి మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే చరణ్‌తో మారుతి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ‘బ్రూస్‌లీ’ అపజయంతో నిరాశచెందిన చరణ్, ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ కొట్టాలని సంకల్పంతో వున్నాడు. ప్రస్తుతం చరణ్ తమిళ్ రీమేక్ ‘తనిఒరువన్’ చిత్రాన్ని చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం వచ్చేవారంలో సెట్స్‌పైకి రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందే సినిమా కూడా త్వరలోనే పట్టాలు ఎక్కనుందట. మరోవైపు అల్లు అర్జున్‌తో కూడా సినిమా చేయడానికి మారుతి ప్రయత్నాలు ఫలించేటట్టుగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు మెగా హీరోలతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మారుతి.