నేరం రీమేక్‌లో సందీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో విభిన్నమైన కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ని విభిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో చిత్రానికి కమిట్ అయినట్టు తెలిసింది. తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయం సాధించిన ‘నేరం’ సినిమా రీమేక్‌లో నటించనున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా నేటివిటీతో వుండే ఈ సినిమాతో మరో ప్రయత్నం చేయనున్నాడు సందీప్. ఆనంద్ రవి దర్శకత్వంలో నటిస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో భారీ ప్రయోగమే చేయనున్నాడట. శేఖర్ కమ్ముల దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఆనంద్ రవి గతంలో నారా రోహిత్ హీరోగా ‘ప్రతినిధి’ చిత్రానికి కథ అందించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.