జక్కన్నకు అక్కినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎస్.ఎస్.రాజవౌళికి ఏటా అందజేసే ఏన్నాఆర్. జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా నాగార్జున ప్రకటించారు. సినీరంగానికి ఆయన చేసిన వైవిధ్యమైన సేవలకుగాను ఈ అవార్డును జక్కన్నకు ప్రదానం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఈనెల 17న సాయంత్రం శిల్పకళావేదికపై నిర్వహించనున్నట్టుగా, కార్యక్రమానికి భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ అపజయం అంటూ ఎరుగని దర్శకుడిగా పేరు పొందిన రాజవౌళికి ఈ అవార్డు అందిస్తుండడం గర్వకారణంగా వుందని, ఆయన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజవౌళికి ఈ అవార్డు అందిస్తుండడం ఆనందదాయకంగా వుందని వివరించారు.