అంతా మనమంచికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్య, ఆరతి జంటగా రూపొందించిన చిత్రం ‘అంతా మనమంచికే’. ఎలైట్ పిక్చర్స్, స్ప్రింగ్ ఫిలింస్ పతాకాలపై ఎం.కె.షరీఫ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని రాజ్‌కందుకూరి విడుదల చేసి తొలి కాపీని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మహబూబ్ అలీఖాన్ మాట్లాడుతూ- వైవిధ్యమైన కథతో పాజిటివ్ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.
తాను తొలిసారిగా హీరోగా నటించిన ఈ సినిమా కథ సరికొత్తగా వుంటుందని హీరో ఆర్య తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ట్విస్టులు సరికొత్తగా వుంటాయని, అంతా మంచికే జరిగే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు ఎన్.కె.షరీఫ్ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు. సందీప్, సుమన్‌శెట్టి, బాషా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:కృష్ణ జక్కుల, పాటలు:లక్ష్మణ్ గంగ, సంగీతం:స్వరన్, నిర్మాతలు:మహబూబ్ అలీఖాన్, ఎం.కె.షరీఫ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎం.కె.షరీఫ్.