సినిమా నాకు ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్, ఈషా గుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో వైకింగ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రైనా జోషి నిర్మించిన వీడెవడు చిత్రం ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా హీరో సచిన్ జోషి చెప్పిన విశేషాలు.
* కబడ్డీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ను మాత్రమే. కానీ ఎందుకు కిల్లర్‌గా మారాల్సి వచ్చిందనేది అసలు కథ. స్క్రీన్‌ప్లే నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ప్రేక్షకుల్ని థ్రిల్ కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. ఇందులో నా పాత్ర చాలా షేడ్స్‌లో వుంటుంది.ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, పాటలకు మంచి క్రేజ్ వచ్చింది.
* సత్య ఈ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కథ ఎలావున్నా దాన్ని నడిపే విధానమే ముఖ్యం. దర్శకుడు సత్య అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే కెమెరా వర్క్, తమన్ సంగీతం అద్భుతంగా వుంటాయి. కొత్త తరహా సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌కు రెండు షేడ్స్ వుంటాయి. అవేంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
* ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాను. నేను డబ్బుకోసం సినిమా చేయను. నాకు సినిమా అంటే ఫ్యాషన్. పరిశ్రమలో ఫ్యాషన్‌తో పని చేసే వారు చాలా తక్కువ. అందుకే మనకు సక్సెస్ రేటు కూడా తక్కువగానే వుంటుంది. త్వరలోనే హిందీలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

- శ్రీ