మొదట తమన్నానే హీరోయిన్ అనుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా పరిశ్రమకు పరిచయమైన తొలి చిత్రం ‘అల్లుడు శీను’తో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. ఆ సినిమా తరువాత నటిస్తున్న మరో చిత్రం ‘స్పీడున్నోడు’. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో గుడ్‌విల్ సినిమా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...
సినిమా గురించి చెప్పండి?
తమిళంలో సూపర్‌హిట్ అయిన సుందరపాండ్యన్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన కథ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.
రెండవ సినిమానే రీమేక్ చేయడానికి కారణం?
రీమేక్ చేయాలని కాదు. ‘అల్లుడు శీను’ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ అది కుదరలేదు. ‘అల్లుడు శీను’ విడుదలైన సమయంలో 30కిపైగా కథలు విన్నాను. అపుడే భీమనేనిగారు ఈ కథ చెప్పారు. అప్పుడే కథ నాకు బాగా కనెక్ట్ అయింది. అందుకే చేశాం.
ఆ సినిమాకూ ఈ సినిమాకూ
మార్పులు ఎలా వున్నాయి?
కథ యథావిధిగా వుంటుంది. ఆ సినిమా అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా వుంటుంది. కానీ తెలుగులో మాత్రం కమర్షియల్ అంశాల కోసం చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. కానీ క్లైమాక్స్ మాత్రం మార్చలేదు.
మీరెక్కువగా తమన్నాతోనే చేయడానికి కారణం?
నిజానికి ఈ సినిమా కోసం తమన్నాను హీరోయిన్‌గా అనుకున్నాం. కానీ కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని సోనారికను ఎంపిక చేశాం. తమన్నా కోసం సంప్రదించినపుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాం. తను మంచి డాన్సర్.
తమన్నాతో మీ రిలేషన్?
తమన్నా నేను బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.
మొదటి సినిమాలో చేసిన పొరపాట్లు ఈ సినిమాలో సరిదిద్దుకున్నారా?
నా మొదటి సినిమా ‘అల్లుడు శీను’లో కంటే ఈ సినిమా కోసం పది రెట్లు ఎక్కువగా కష్టపడ్డా. ప్రతి విషయంలో కేర్ తీసుకున్నాను. ఈ సినిమాలో కూడా కొత్తగా కన్పిస్తా.
మీ పాత్ర గురించి?
ఈ సినిమాలో యంగ్ ఎనర్జిటిక్ పాత్ర నాది. కర్నూలుకు చెందిన కుర్రాడిగా కనిపిస్తాను. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. ఫ్రెండ్స్‌కోసం ఏదైనా చేసే కుర్రాడు.
దర్శకుడు భీమనేనితో పనిచేయడం?
భీమనేనిగారు పవన్‌కళ్యాణ్, రవితేజ, వెంకటేష్‌లాంటి హీరోలతో పనిచేశారు. నిజంగా ఆయనకున్న పాషన్ ఇంకా తగ్గలేదు.
సీనియర్ డైరెక్టర్స్‌తో పనిచేసినపుడు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భీమనేనిగారు ప్రతి సినిమాను తన మొదటి సినిమాలానే భావిస్తారు. మంచి డెడికేషన్ వున్న దర్శకుడు.
మ్యూజిక్ గురించి?
వసంత్ అందించిన పాటలు మంచి హిట్ అవడంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అలాగే టెక్నికల్‌గా కూడా అన్ని విభాగాలవారు కష్టపడి పనిచేశారు.
సినిమా చూసుకున్నారా?
స్నేహితులతో కలిసి సినిమా చూశాను. చాలా ఆనందంగా వుంది. ఇంతకుముందు కాస్త టెన్షన్ వుండేది. కానీ సినిమా చూసిన తరువాత చాలా ఆనందం వేసింది. అలాగే పేరెంట్స్‌తోపాటు ఫ్రెండ్స్ కూడా ఎమోషన్ అయ్యారు.
తదుపరి చిత్రాలు?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. అది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందనుకుంటాను. దాంతోపాటు వేరే కథలు కూడా వింటున్నాను.

-శ్రీ