భాగమతికి మెరుగులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బానర్‌పై తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ఇప్పటికే పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సి వుండగా ఆలస్యమవుతోంది. దానికి కారణం సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ వాటిని రీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కే ఈ సినిమా కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్న నేపథ్యంలో రీ షూట్‌లు తప్పడంలేదట. నిజానికి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తే అది కుదరకపోవడంతో అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అరుంధతి, బాహుబలి తరహాలో అనుష్క తనదైన స్టామినాతో నిరూపించుకునే చిత్రంగా భాగమతి రూపొందుతోందట.