ఆ ఒక్కడే.. ఈ స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురగదాస్ దర్శకత్వంలో నటించడానికి గత పదేళ్లుగా ఎదురు చూస్తున్నా. తుపాకీ చిత్రాన్ని తెలుగులో చేయాలనుకున్న అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు చేసిన స్పైడర్ నా కెరీర్‌లోనే బాగా నచ్చి చేసిన సినిమా. నా సినిమాల్లో అత్యుత్తమమైన సినిమాగా స్పైడర్‌నే పేర్కొంటా అన్నాడు హీరో మహేష్ బాబు. మురగదాస్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం స్పైడర్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలో జరిగింది. ఆడియో సీడిని పార్వతి, రమ్య, సుమ సంయుక్తంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మరికొన్ని విషయాలు వెల్లడిస్తూ ఇన్నాళ్ల తన కెరీర్‌లో స్పైడర్ ఒక కొత్త అనుభూతి ఇచ్చిందన్నారు. షూటింగ్ సమయంలో తొలి సినిమాలో నటిస్తున్నానేమో అన్నట్టుగా వుండేదని, తొలిసారిగా తమిళంలో నటిస్తున్న చిత్రాన్ని 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. హారిస్ జైరాజ్ సంగీతం, పీటర్ హేన్స్ ఫైటింగ్స్ సినిమాకు హైలెట్‌గా వుంటాయన్నారు. దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ ఒక్కడు సినిమా చూసినప్పుడు మహేష్‌బాబుతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని, తుపాకీ కూడా మహేష్ బాబుతో చేయాల్సింది కానీ వీలు కాలేదన్నాడు. రెండు భాషల్లో స్పైడర్‌ను రూపొందించడం పెద్ద బాధ్యతగా తాను భావించానని, మహేష్‌బాబుతో ఒక్క సినిమా అయినా చేయాలన్న తన కోరిక ఈ చిత్రంతో తీరిందని కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు.