పాపం అంజలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పాప అంజలికి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలగాలనే కోరిక తీరకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాంగద భారీ పరాజయం అందుకోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. తనను హీరోయిన్‌గా గుర్తించిన తమిళ పరిశ్రమలోనూ పరిస్థితి అలాగే వుంది. ప్రస్తుతం జైతో కలిసి బెలూన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇప్పటికే గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్న అంజలికి మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్టు దక్కింది. కానీ ఆమె ఫోకస్ అంతా తెలుగు, తమిళ భాషల్లోనే ఉంది. ప్రస్తుతం అంజలికి తమిళంలో మరో అవకాశం దక్కిందట. విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని సరసన ఈమెకు ఛాన్స్ దక్కింది. స్టార్ హీరోల సినిమాల కోసం చూస్తున్న అంజలికి ఈ ఆఫర్ రావడంతో షాక్ అయిందట. ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని దాని ద్వారా మంచి అవకాశాలను అందుకోవాలనే ఆశతో ఉంది. స్టాలిన్ భార్య కృతిక దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.