నటిగా మెప్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 3ఉంగరాల రాంబాబు2 చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది మియా జార్జ్. మలయాళంలో పలు చిత్రాలు చేసిన ఈమె, తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని చెబుతోంది. 3ఉంగరాల రాంబాబు2 చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా మియా జార్జ్ చెప్పిన విశేషాలు...
మలయాళంలో...
మలయాళంలో దాదాపు 15 చిత్రాలు చేశాను. ఆ తరువాత తమిళంలో కూడా ఏడెనిమిది సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినపుడు దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ముఖ్యంగా నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది.
సావిత్రిగా...
ఇందులో నేను సావిత్రిగా కన్పిస్తాను. రెండు రకాల షేడ్స్ వున్న పాత్ర. మొదటి భాగంలో సిటీలో వుండే అమ్మాయిగా, మోడరన్ గర్ల్‌గా కన్పిస్తాను. రెండో భాగంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా, ట్రెడిషనల్‌గా ఉంటాను. ఇందులో నేను సునీల్ ఆఫీసులోనే ఉద్యోగిగా కన్పిస్తాను.
సునీల్‌తో..
సునీల్‌తో పనిచేయడం చాలా సరదాగా వుంటుంది. తను సెట్‌లో వుంటే సందడిగా వుంటుంది. ముఖ్యంగా అతనికి సినిమా అంటే ఇష్టం. చాలా కష్టపడతాడు. డాన్స్‌ల సమయంలో చాలా టెన్షన్ పడ్డాను సునీల్ స్పీడ్‌ను అందుకోవడానికి. 3ఉంగరాల రాంబాబు2 పాత్రలో అద్భుతంగా నటించాడు. అతను హెల్త్‌పరంగా చాలా టిప్స్ ఇచ్చాడు.
నటిగానే..
కథలో నా పాత్రకంటూ ప్రాముఖ్యత ఉండాలి. అలాగని కథ మొత్తం నా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అంటే ప్రస్తుతం పాటలకు, గ్లామర్ షోలకు పరిమితం అవుతోంది. అలా కాకుండా ప్రత్యేకతలున్న పాత్రల్లో నటించేందుకు సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చర్చల్లో వుం ది. దాంతోపాటు మలయాళంలో మమ్ముట్టి సినిమాలో నటిస్తున్నా.

- శ్రీ