బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.జి.వెంచర్స్ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం గేమర్. శ్రీనిత్‌రాజ్, కల్యాణి, అనిరుధ్, నేహ, చిత్రం2 శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత రాజేష్ తడకల మాట్లాడుతూ- మా బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ఏడవ చిత్రమిది. ప్రతిసారి కొత్తవారితో సినిమాలు చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా శ్రీనిత్‌రాజ్, కల్యాణి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. బెట్టింగ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది. లవ్, హర్రర్ ఎలిమెంట్స్ కూడా వుంటాయి2అని అన్నారు. హీరో శ్రీనిత్ మాట్లాడుతూ- ఇందులో నాది ఛాలెంజింగ్ రోల్. కొత్త తరహాలో సాగే సినిమా ఇది అన్నారు. తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినందుకు రాజేష్‌కి ప్రత్యేక ధన్యవాదాలు అని హీరోయిన్ కల్యాణి తెలిపారు.