అతిథి పాత్రలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపు ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’ వంటి పెద్ద సినిమాలో నటించి మరోవైపు మాస్ మహారాజ రవితేజతో ‘టచ్ చేసి చూడు’, మెగా హీరో వరుణ్‌తేజ్‌తో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోను, తమిళం, మలయాళంలో ఒక్కో ప్రాజెక్టు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా అతిథి పాత్రలో నటించడానికి కూడా సిద్ధమయింది. దర్శకుడు అనిల్ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ, మెహ్రీన్ కౌర్ కలిసి చేస్తున్న పాటలో కాసేపు స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. రాశీఖన్నా కెరీర్‌లో చెప్పుకోదగిన హిట్లలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’ ఒకటి. ఈ అనుబంధంతోనే రాశీఖన్నా అనిల్ చిత్రంలో అతిథి పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు.