పాటల్లో మహర్జాతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిషేక్ మధుశ్రీ, డేవిడ్‌రాజ్, మోనా, స్మైలీ ప్రధాన పాత్రల్లో గతంలో ‘అలివేలు’, ‘నైస్‌గయ్’, ‘ఎవరినైనా.. ఎదిరిస్తా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పరకోటి బాలాజీ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మహర్జాతకులు’. ధృవ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సతీష్‌కుమార్, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ- తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి దిశలో పయనించేలా చేస్తుండడం ఆనందంగా వుందని, ఐదవ ఆటను చిన్న సినిమాలకు కేటాయించడంతోపాటు షూటింగ్‌ల అనుమతికి సింగిల్ విండో విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని, ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయని, సినిమా విడుదల సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. శ్రీరంగం సతీష్‌కుమార్ మాట్లాడుతూ- చిన్న సినిమాను బతికించుకోవడం కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు, నిరాహారదీక్షలు చేశామని, ఆ ఆకాంక్షలు నేడు నెరవేరడం చాలా హ్యాపీగా వుందని పేర్కొన్నారు. దర్శక నిర్మాత బాలాజీ మాట్లాడుతూ - క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో జరిగిన పరిణామాలతో వుంటుందన్నారు. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.