ఆచారి మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్‌లో భాగంగా చిత్రీకరిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తుండగా బైక్ స్కిడ్ అవడంతో జరిగిన యాక్సిడెంట్‌లో చిత్ర కథానాయకుడు మంచు విష్ణు, కథానాయిక ప్రగ్యా జైస్వాల్ గాయాలపాలైన విషయం తెలిసిందే. ప్రగ్యా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోగా, మంచు విష్ణుకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ కారణంగా మలేసియాలో మొదలైన సెకెండ్ షెడ్యూల్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ యాక్సిడెంట్ కారణంగా అయిన గాయాల నుంచి దృఢ నిశ్చయంతో చాలా త్వరగా రికవరీ అయిన మంచు విష్ణు మళ్లీ షూటింగ్ మొదలెట్టాడు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ- చాలా సీరియస్‌గా యాక్సిడెంట్‌లో తగిలిన గాయాలను సైతం లెక్క చేయకుండా హీరో మంచు విష్ణు చాలా త్వరగా రికవరీ అయ్యారు. అందుకే త్వరగా షూటింగ్ రీస్టార్ట్ చేయగలిగాం. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం అన్నారు.