త్వరలో రథావరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమురళి, రచితారామ్ జంటగా ధర్మశ్రీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ధర్మశ్రీ మంజునాథ్ నిర్మించిన ‘రథావరం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కావాల్సి ఉంది. కానీ పెద్ద సినిమాలు విడుదలవుతుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిర్మాత మంజునాథ్ వివరాలు తెలియజేస్తూ- కన్నడంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొత్త కానె్సప్టుతో తెరకెక్కిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఉద్దేశ్యంతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనువదించి విడుదల చేస్తున్నాం. ఈనెల 1న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకున్న థియేటర్లు దొరకకపోడంతో వాయిదావేసి త్వరలోనే విడుదల చేస్తామన్నారు.