షూటింగ్ అదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ కథానాయకుడిగా వైవిధ్యమైన దర్శకుడు అట్లీ నేతృత్వంలో తేనాండాళ్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అదిరింది’. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మురళి రామస్వామి మాట్లాడుతూ- శరత్ మరార్ ఈ ప్రాజెక్టులో కలవడం సంతోషదాయకమని, దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, తమ సంస్థకు లాండ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందని శరత్ మరార్ తెలిపారు. విజయ్ పాత్ర సరికొత్తగా దర్శకుడు డిజైన్ చేశారని, గతంలో ఆయన సినిమాలలో కనిపించినదానికన్నా వైవిధ్యంగా ఈ చిత్రంలో కనిపిస్తారని, ఫైట్స్, డాన్స్ సరికొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, వడివేలు, కోవై సరళ, సత్యన్, సత్యరాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, పాటలు: వివేక్, కెమెరా:జి.కె.విష్ణు, ఎడిటింగ్:రూబన్, నిర్మాతలు:మురళి రామస్వామి, హేమా రుక్మిణి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:అట్లీ.