అమ్మాయిలంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీవర్మ, మాళవికా మీనన్, శివాజీరాజా ప్రధాన తారాగణంగా గాయత్రి రీల్స్ పతాకంపై కృష్ణమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మాయిలంతే అదోటైప్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమ్ మాట్లాడుతూ-్భవోద్వేగాలే హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తీసుకున్న తొందరపాటు నిర్ణయంవల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.
తల్లిదండ్రులకు దూరమయ్యాననే బాధతో కూతురు పడే వేదన పర్యవసానాలమధ్య సాగే ఎమోషనల్ కథ అందరికీ నచ్చుతుందని, త్వరలో ఆడియో విడుదల చేసి అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
నేటి యువతరం తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా వుండే ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించామని ఆయన అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్, పాటలు: పూర్ణాచారి, దర్శకత్వం: కృష్ణమ్.