గుంటూరు టాకీస్ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మిస్తున్న గుంటూర్ టాకీస్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైవిధ్యమైన సినిమాలను రూపొందించడంలో తెలుగు పరిశ్రమ పెట్టింది పేరని, యువకులందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా వుందన్నారు. టైటిల్ హోలీగా వుందని, ఒక నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంటుందన్నారు. దర్శకుడు ప్రవీణ్ సినిమామీద వున్న పాషన్‌తో రంగానికి వచ్చిన వ్యక్తని, జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ, బాలకృష్ణ సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం ఆనందంగా వుందని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ, చందమామ కథలు సమయంలోనే ఈ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యానన్నారు. సిద్ధు మాట్లాడుతూ, కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇదన్నారు.