రానాకూడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్న రానా మరొక అడుగు ముందుకు వేసి హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఘాజి చిత్రంతో మంచి గుర్తింపు పొందిన రానాకు వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించగలడన్న నమ్మకం వచ్చింది. హీరోయిజాన్ని పక్కన పెట్టి ఆయన చేస్తున్న పాత్రలను గమనించిన లండన్ బేస్డ్ ప్రొడక్షన్ సంస్థ ఒకటి ఆయనతో ఓ హాలీవుడ్ చిత్రం చేయడానికి ముందుకు వచ్చింది. 1888లో దాదాపు 700మంది ప్రయాణికులతో వెళుతున్న విజిల్ అనే భారీ నౌక కనపడకుండా పోయిన నేపథ్యంలో అల్లుకున్న కథతో ఈ చిత్రం సాగనున్నదట. నౌకను కనుగొనేందుకు సహకరించే శాస్తవ్రేత్తగా రానా నటించనున్నాడు. ద్వానిల్ మెహతా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ‘విజిల్’ అనే పేరును ఖరారు చేశారు. మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరంలో ప్రారంభం కానున్నదట.