ఇద్దరు స్నేహితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంత లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూరజ్, సానియా, రవీంద్ర తేజ ప్రధాన తారాగణంగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘2 ఫ్రెండ్స్’. ముళ్లగూరు అనంతరాములు, రమేష్ నాయుడు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాతలు మాట్లాడుతూ- నాలుగు షెడ్యూల్స్‌లో సినిమాను బెంగళూరు, అనంతపురం, వరంగల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తు తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేయనున్నామన్నారు. ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా అన్న పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేటి యువత ఆలోచనల నేపథ్యంలో సాగుతుందని వారు తెలిపారు. వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చేలా రూపొందించామని వారు అన్నారు. కార్తీక్, సారా, ధన్‌రాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, వై.విజ య, శ్రీలక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూరు ఘటికాచలం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీనివాస్ జి.ఎల్.బి.