ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి పేరుతో సావిత్రి బయోపిక్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే అనేకమంది వైవిధ్యమైన తారలు నటిస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. అయితే సావిత్రి జీవితంలో ప్రముఖమైన పాత్రగా కనిపించే ఎస్.వి.రంగారావుగా ఎవరు నటించనున్నారన్న విషయాన్ని అప్పట్లో చర్చ కూడా జరిగింది. మోహన్‌బాబు అయితే పాత్రకు న్యాయం జరుగుతుందని కొందరు విశే్లషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇపుడు అదే నిజమైంది. ఎస్.వి.రంగారావుగా మోహన్‌బాబు మహానటి చిత్రంలో నటించనున్నారని దర్శకుడు ప్రకటించారు. మోహన్‌బాబు కూడా ఈ పాత్రలో నటించడానికే సిద్ధం అవుతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.