రియల్ హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్‌లో తనదైన శైలిలో సినిమాలు చేసి మెప్పించిన హీరో విశాల్ సామాజిక సేవలో ఈమధ్య తెగ పాల్గొంటున్నాడు. ముఖ్యంగా రైతుల విషయంలో విశాల్ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం చెన్నై రైతులు ఢిల్లీలో ధర్నా చేసినపుడు విశాల్ అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచి అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి వారి సమస్యను తీర్చాడు. అయితే ఇప్పుడు మరోసారి ఈ యువ హీరో తన సినిమా కలెక్షన్స్ ద్వారా రైతులకు అండగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. పేద రైతులకు ఈ రోజు విడుదల కాబోయే తన సినిమా కలెక్షన్స్‌లో కొంత భాగాన్ని ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యా డు. హీరోగా తాను నిర్మించిన ‘తుప్పరివాలన్’ అనే సినిమా మొదటి రోజు అమ్ముడుపోయే టికెట్‌లో నుంచి ఒక్కో రూపాయిని నష్టపోయి బాధపడుతున్న రైతు కుటుంబాలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో విశాల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. వాహ్..రియల్ హీరో విశాల్!