ఎన్టీఆర్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైలవకుశ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అభిమానులను ఆనందపరచడానికి ఉత్తమాభిరుచిగల కథల్లో నటిస్తానని చెబుతున్న ఎన్టీఆర్ తాజా చిత్రం ఏమై వుంటుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్, కొరటాల శివ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే వీరిద్దరితో ఈ రెండు చిత్రాలు ఇప్పుడే ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.
వారి వారి సినిమాలతో వారు బిజీగా వుండడంతో ఎవరో ఒకరి చిత్రం ప్రారంభమయ్యేదాకా మరో సినిమా చేస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో వచ్చే ఫిబ్రవరిలో సినిమా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరిలోపు మరో చిత్రం చేయాలని ఎన్టీఆర్ కథను సిద్ధం చేస్తున్నారట. త్వరలో త్రివిక్రమ్‌తో ఏర్పడనున్న గ్యాప్‌లో మరో సినిమాను ప్రారంభించి అభిమానులకు ఎప్పటకప్పుడు టచ్‌లో వుండాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ చిత్రం ఆయన ప్రారంభించనున్నారని టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. అయితే ఆ చిత్రం ఎలా వుండబోతుం ది, దర్శకుడు ఎవరు అనే సంగతులు మాత్రం ఇంకా బయటకురాలేదు. జైలవకుశ విడుదలయ్యాక ఆ వివరాలన్నీ తెలుస్తాయని భావిస్తున్నారు?!