మోహన్‌లాల్‌కు మోదీ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రభు త్వం తలపెట్టిన స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు ప్రధాని. మనదేశాన్ని శుభ్రం చేయడంతోనే పేదలకు ఎంతో సేవ చేసినట్టుగా భావించవచ్చని, సినిమా రంగంలో ముఖ్యమైన కథానాయకుడుగా మీకున్న గుర్తింపునకు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ప్రధాని కోరారు. ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి మోటివేట్ చేసే శక్తి వుండడంతో ఈ కార్యక్రమానికి సహకరించాలని మోహన్‌లాల్‌ను ప్రధాని కోరారు. ఇందుకోసం భారత్ తరఫున కొంత సమయాన్ని కేటాయించి సేవ చేయాల్సిన అవసరం వుందని తద్వారా కొన్ని లక్షల మంది భారతీయులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.