బాలలే హీరోలుగా డూడూ ఢీఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో బాలల చిత్రాలు ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. బాలల చిత్రోత్సవంలో అప్పుడప్పుడు కొన్ని మంచి చిత్రాలు కనిపిస్తుంటాయి. విదేశాలతోపాటుగా మన దేశంలో అనేక రాష్ట్రాలు వైవిధ్యమైన కథనాలతో బాలల చిత్రాలు రూపొందిస్తున్నాయి. తెలుగులో బాలల చిత్రాల నిర్మాణం చాలా తక్కువగా వుంటోంది. దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ తన ఫిల్మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ఓ బాలల చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొమరంభీమ్ ఫేమ్ భూపాల్ ప్రధాన పాత్రలో అనేకమంది బాలలు కీలక పాత్రల్లో ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘డూడూ ఢీఢీ’ (హాయిగా ఆడుకుందామా) ప్రపంచ వ్యాప్తంగా బాలల మానసిక వికాసాన్ని దెబ్బ తీస్తున్న ఓ వ్యసనాన్ని ఎత్తి చూపుతూ భారతీయ జీవన విధానంలో పరిష్కారం సూచిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇరాన్ వంటి అగ్రశ్రేణి బాలల చిత్రాల శైలిపట్ల అవగాహన ఏర్పరుచుకోవడంతో ఈ సినిమా రూపకల్పనకు ఎంతో దోహదం అయిందని, వరంగల్, రంగాపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసామని అల్లాణి శ్రీ్ధర్ తెలిపారు. వింజమూరి మధు, మాస్టర్ సాయి, మాస్టర్ అభి, బేబీ కావేరీ, స్వప్న, సంగకుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మా ణం, దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్.