చిన్న సినిమాలకు ప్రోత్సాహం: ప్రతాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో సంవత్సరాలుగా పరిశ్రమలో పెండింగ్‌లో వున్న సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని నియమించింది. కె.టి.ఆర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో నిర్మించిన ఈ కమిటీ సూచించిన సలహాలు పరిశ్రమకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడు తూ- చిన్న సినిమాలకు తప్పనిసరిగా ఓ షో వెయ్యాలని సూచించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికే 300 సినిమాలకుపైగా విడుదల కాకుండా ఉన్నాయి. ఐదో షో వేయడంతో ఈ సినిమాలన్నీ విడుదలయ్యే అవకాశం లభిస్తుంది. ఈ సమస్య కోసమే చాలాకాలంగా మేం పోరా టం చేస్తున్నాం. అలాగే సింగిల్ విండో విధానంపై పర్మిషన్ ఇస్తామనడం సినిమా పరిశ్రమకు ప్రభుత్వం చాలా మంచి సహకారం అందిస్తుంది. దీనివల్ల చిన్న సినిమాలకి మంచి లాభం జరుగుతుంది. అలాగే బస్టాప్‌లలో వున్న ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్లను నిర్మించాలనే మంచి ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు విధానాలు దసరానుండి అమల్లోకి వస్తాయని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారన్నారు.