వందేమాతం, చంద్రబోస్‌లకు కాళోజీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా భార త్ కల్చరల్ అకాడమీ తెలు గు టెలివిజన్ రచయితల సంఘం నిర్వహిస్తున్న ఈ పురస్కారాలకుగాను ఈ ఏడాది రచయిత చంద్రబోస్, గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, నాగబాల సురేష్‌కుమార్, అమరేశ్‌కుమార్, సాయివెంకట్ తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ- కాళోజీ రచనలు చదివాను. ఆయన పేరుతో ఏర్పాటుచేసిన ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా వుంది. ఈ పురస్కారానికి నన్ను ఎంపికచేసిన కమిటీకి నా ధన్యవాదాలు అన్నారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ-ప్రజానాట్యమండలిలో ఎం తోమంది కళాకారులున్నా నన్ను వెన్నుతట్టి ఇంతటి గుర్తింపును తెచ్చిన అన్న నల్లూరి వెంకటేశ్వరరావుకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను. ఈ రోజు ఈ అవార్డు అందుకుంటున్నానంటే ఆయన చలవే అన్నారు.