భయపెట్టడంలో నెక్స్ట్ నువ్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడానికి నాలుగు భారీ సినిమా నిర్మాణ కంపెనీలు ఒక్క తాటిపైకి వచ్చి వి4 క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించాయి. గీతా ఆర్ట్స్, యు.వి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌లతో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా తెరకెక్కుతున్న మొదటి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది, వైభవి శాండిల్య, రష్మి గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ- కొత్త బ్యానర్‌ను మొదలుపెట్టడానికి కారణమేంటని అందరూ అడుగుతున్నారు. ఏ నిర్మాత అయినా తను నమ్మింది కరెక్ట్ అని సినిమాలు తీస్తూ వెళితే, కొన్నాళ్లకు సినిమాలు తీయకుండా ఆగిపోతారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ వుంటుంది. దానిప్రకారంగా సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతో మరో రెండు బ్యానర్‌లతో కలిసి ఈ కొత్త సంస్థని మొదలుపెట్టాం.
దీని ద్వారా యంగ్‌స్టర్స్‌తో పనిచేయడం మాకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ- నటుడిగా 25 ఏళ్ళు గడిచిపోయాయి. సినిమాల్లో ఎంటర్ అవ్వాలని ఎప్పటినుంచో ఉండేది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానంటే దానికి కారణం అల్లు శిరీష్. టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందుంటారు. ఎంతో అనుభవమున్న నిర్మాతలతో సినిమా చేస్తున్నాననే భయం వుంది. ఆ బ్యానర్‌లకు చెడ్డ పేరు తేకుండా మంచి సినిమా చేయాలనే భయమది. పరిశ్రమకు వచ్చిన తరువాత చాలా నేర్చుకున్నాను. నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ- వి4 బ్యానర్‌లో నిర్మిస్తున్న మొదటి సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా వుంది. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా ప్రభాకర్ మంచి దర్శకుడు అవుతాడు అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ- ఇంత మంచి సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సాయి కార్తీక్, కెమెరా:కార్తీక్ పళని, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, సహనిర్మాత:ఎస్.కె.ఎన్, నిర్మాత:బన్నీ వాస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రభాకర్.