ఆసక్తిరేపుతున్న జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తుండడం సంచలనం రేపుతోంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా అటు బిజినెస్ వర్గాల్లో కూడా భారీ క్రేజ్‌ను నింపింది. మూడు పాత్రలతో తనదైన నటనను కనబరచనున్నాడట ఎన్టీఆర్. ముఖ్యంగా ఇందులోని ‘జై’ పాత్రపై సర్వతా ఆసక్తి నెలకొంది. ‘‘ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణుణ్ణి సంపాలంటే... సముద్రమంత ద.. ద.. ధైర్యముండాల’’ అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పటికే వైరల్ అయ్యింది. నెగెటివ్ షేడ్‌లో రావణుడిగా ఆకట్టుకోనున్నాడట ఎన్టీఆర్. ఈ పాత్ర చుట్టే ఎక్కువగా కథ తిరుగుతుందని తెలిసింది. లవ, కుశుడిగా మరో రెండు పాత్రలు కూడా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ చిత్రం 21న అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి జై, లవ, కుశల ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు.