మురుగదాస్‌తో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్‌కళ్యాణ్ 25వ చిత్రం షూటింగ్ ఇటీవలే విదేశాల్లో ఓ పాట చిత్రీకరణ జరుపుకుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పవన్, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనతో ఓ క్రేజీ దర్శకుడు సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు- మురుగదాస్. ప్రస్తుతం మహేష్‌తో స్పైడర్ చిత్రాన్ని చేస్తున్న మురుగదాస్ ఈమధ్యే పవన్‌కళ్యాణ్‌ని కలిసినట్టు తెలిపాడు. గతంలో మురుగదాస్ చేసిన కత్తి సినిమా చూసిన పవన్, ఆయన్ను మెచ్చుకున్నాడు. సోషల్ మెసేజ్‌తో ఉన్న సినిమాలు చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడట పవన్. ఈ నేపథ్యంలో కత్తి సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో వున్న మురుగదాస్ ఈ చిత్రాన్ని పవన్‌తో చేస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే స్క్రిప్ట్ సిద్ధం చేసి పవన్‌ని కలుస్తాడట. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.