29న మహానుభావుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని ముందే విడుదల చేయాలనుకున్నాం. కానీ దసరా పండుగ అయితే ఇలాంటి సినిమాలకు బావుంటుందని ఈనెల 29న విడుదల చేస్తున్నాం. శర్వానంద్, మెహరీన్ కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రమిది అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ- నేను బాగా ఎంజాయ్ చేసిన పాత్ర ఇది. ఇలాంటి స్క్రిప్ట్ మళ్లీ వస్తుందనుకోను. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది అన్నారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ- ఇంత మంచి చిత్రంలో మంచి పాత్ర చేశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో మదుమణి, బాలు, జెమిని సురేష్. ఎస్‌కెఎన్ తదితరులు పాల్గొన్నారు.