జిల్ దర్శకుడితో.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హిందీలో కూడా ప్రభాస్‌కు చాలా ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహో’లో నటిస్తున్నాడు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాతోపాటు తదుపరి చిత్రానికి ప్రభాస్ ఓకె చెప్పినట్లు సమాచారం. ఆమధ్య గోపీచంద్‌తో ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ కుమర్‌తో ఉంటుందట. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, ఈ సినిమా 1960-70ల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, అచ్చమైన ప్రేమకథగా తెరకెక్కిస్తారని వార్తలొస్తున్నాయి. మరోవైపు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.