అక్టోబర్ నుంచి సైరా షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుండి మొదలుకానున్నదట. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారట. అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుధీప్ వంటి తారలు నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించనున్నారట.