సంఘమిత్రగా దిశా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి స్ఫూర్తితో తమిళ దర్శకుడు సుందర్ సి భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పదిరోజుల తరువాత ఆగిపోయింది. ఇందులోనుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో సినిమాకు అసలు కష్టాలు మొదలయ్యాయి. సంఘమిత్ర పాత్రలో ఎవరు నటిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికోసం పలువురు హీరోయిన్లను పరిశీలించారు. తాజాగా దిశాపటానిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దిశాపటానీ ఆ తరువాత తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. బాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాలు చేసిన ఈమె తాజాగా సంఘమిత్రలో ఎంపికవ్వడం విశేషం. అయితే యూనిట్‌నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.