హీరోయిన్‌గా అంజలి అమీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎవరూ ఊహించని సంఘటన జరగనుంది. ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిన్లంటే ఇలా వుండాలి, అలా వుండాలి అని కొన్ని రకాల పరిధులు వుం డేవి. కానీ ఇప్పుడవి చెరిగిపోతున్నాయి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది ట్రాన్స్ జండర్ అయిన అంజలి అమీర్. మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి అమీర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారట. సినీ వర్గాల్లో ఇదో పెద్ద సంచలనం. జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ట్రాన్స్ జండర్ (హిజ్రా)గా వున్న అంజలి అమీర్ ఆ తరువాత మోడలింగ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ కూడా వచ్చింది. జీవితంలో ఎన్నో కష్టాలు అవమానాలు పడి ఈ స్థాయికి వచ్చిన అంజలి అమీర్ హీరోయిన్‌గా ఎలాంటి ఇమే జ్ తెచ్చుకుంటుందో చూడాలి.