అవన్నీ రూమర్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ నయనతారపై రోజురోజుకు రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే జోరు ప్రేమాయాణం సాగిస్తున్న ఈమె త్వరలోనే రహస్య వివాహం చేసుకుంటుందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. దాంతోపాటు పెళ్లి గురించి రకరకాల పుకార్లు రావడంతో ఈ విషయంపై మండిపడుతోంది నయనతార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె స్పందిస్తూ నాకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ప్రచారం చేస్తున్నవారే అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోందని మరోవైపు అంటున్నారు. ఇలాంటి వార్తలను పట్టించుకునే అవసరం నాకు లేదు. నేను గ్లామర్ రంగంలో వున్నాను కాబట్టి నా ప్రయత్నాలు నేను చేస్తుంటాను. మడికట్టుకు కూర్చోను. నా పెళ్లి గురించి అనేక అసత్య వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఒట్టి రూమర్సే. నా తల్లిదండ్రు లు నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. అలాంటివారికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానా? ఇలాంటి వార్తలు రాసేవారు కాస్త ఆలోచిస్తే మంచిది. ఎవరెన్ని రాసినా ఇలాంటి పుకార్లు నమ్మవద్దని గట్టిగా చెబుతోంది.