రాణిగారి బంగళా లోగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్‌నంద, రేష్మీ, శివకృష్ణ ప్రధాన తారాగణంగా డి.దివాకర్ దర్శకత్వంలో వి.సినీ స్టూడియో నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రాణిగారి బంగళా’. షూటింగ్ పూర్తిచేసిన ఈ చిత్రానికి సంబంధించిన లోగో విడుదల హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు డి.దివాకర్ మాట్లాడుతూ ఈ సినిమాకోసం అనేక పేర్లను పరిశీలించి, చివరికి ‘రాణిగారిబంగళా’ అన్న పేరును ఎంపిక చేశామని, ఈ కథకు ఈ పేరు ఖచ్చితంగా సరిపోతుందని తెలిపారు. గత డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్‌లో జనవరి చివరికల్లా పూర్తిచేశామని, ఫిబ్రవరి మార్చి నెలల్లో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కెమెరా పనితనం హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో హీరోయిన్, హీరో పాత్రలకు తగిన విధంగా నటించారని, శివకృష్ణ కాటికాపరిగా ఓ కీలకమైన పాత్రలో నటించారని ఆయన తెలిపారు. చాలాకాలం తర్వాత ప్రాముఖ్యం ఉన్న పాత్ర ఈ సినిమాలో దొరికిందని ఈ కథ వినగానే కచ్చితంగా ఆ పాత్రలో నటించాలని నిర్ణయించుకున్నానని నటుడు శివకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కెమెరామెన్ ప్రభాకర్‌రెడ్డి, బాలాజీ నాగలింగం, వైజాగ్ ప్రసాద్, ప్రసన్నకుమార్, సాగర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: అనిల్‌మల్నాడ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.దివాకర్.