12న లిటిల్‌స్టార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష ప్రధాన తారాగణంగా హెచ్.డి.విజన్ ఇండియా పతాకంపై రషీద్‌బాషా దర్శకత్వంలో ఇబ్రహీం షేక్, అమీర్‌బాషా షేక్, ఖాజాబి షేక్, నజీమ్‌షేక్ రూపొందించిన ‘లిటిల్ స్టార్స్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రషీద్‌బాషా మాట్లాడుతూ బాలల చలనచిత్రోత్సవాలలో సినిమాలు చూసి, ప్రేరణ పొంది ఈ పిల్లల చిత్రం రూపొందించాలనుకున్నానని, చిన్నపిల్లలను నటులుగా ఎంపిక చేసి వారికి వర్క్‌షాపులు నిర్వహించామని, వారే ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించడం విశేషమని తెలిపారు. ఓ ఆరుగురు స్నేహితులు తమ స్నేహితురాలికోసం ఏం చేశారు అనే కథనంతో ఈ సినిమా సాగుతుందని ఆయన అన్నారు. వేదకుమార్ మాట్లాడుతూ కథాంశాల పరంగా తెలుగు సినిమా మరింత ఎదగాల్సిన అవసరం వుందని, బాలల చిత్రాలకు సరైన ఆదరణ లభించని ఈరోజుల్లో వాటికి పెద్ద పీట వేయాల్సిన అవసరం వుందని తెలిపారు. మన దేశంలో పిల్లల భావాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సినిమా రూపంలో హైదరాబాద్‌లో చూపిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భగీరధ, కిషన్‌సాగర్, ఇబ్రషీంషేక్, అమీర్‌బాషా తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకు ఎడిటింగ్: నివాస్, సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: కిషన్‌సాగర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రషీద్‌బాషా.