అనుష్క అంటే చాలాఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, మెహ్రీన్‌కౌర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్‌తో ఇంటర్వ్యూ..
మీ నేపథ్యం..
నేను పుట్టింది పంజాబ్‌లో. న్యూదిల్లీలో నా చిన్నతనం, చదువు గడిచింది. ఆ తరువాత కెనడా వెళ్లి డిగ్రీ పూర్తిచేశాను. తరువాత బొంబాయికి వచ్చి కమర్షియల్ యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టాను. ఫెయిర్ అండ్ లలీ, పియర్స్ ఇలా చాలా యాడ్స్‌లో నటించాను.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
యాడ్‌లో చూసి నా ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫొటోలు పంపమని హను రాఘవపూడి అడిగారు. న్యాచురల్‌గా ఉన్న ఫొటోలను పంపాను. అవి ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత ఆయన్నుంచి పిలుపువచ్చింది. ఆడిషన్ చేసి హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
మీ పాత్ర గురించి?
సినిమాలో నా పాత్ర పేరు మహాలక్ష్మి. రాయలసీమలోని అనంతపురం ప్రాంతానికి చెందిన అమ్మాయి. కుటుంబానికి మంచి విలువనిస్తుంది. బబ్లీగా, బోల్డ్‌గా ఉండే అమ్మాయి. చాలా పొగరుగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. కృష్ణ, మహాలక్ష్మీలు పదిహేనేళ్లనుంచి ప్రేమించుకుంటారు. కృష్ణను పెళ్లిచేసుకోవడమే మహాలక్ష్మీ జీవిత లక్ష్యం. ఇదొక ప్రేమకథని చెప్పలేము. సినిమాలో యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కృష్ణ, మహాలక్ష్మీ మధ్య జరిగే సంఘటనలే ఈ సినిమా. నిజానికి కృష్ణ చాలా భయస్తుడు. మహాలక్ష్మి ప్రేమను దక్కించుకునే ప్రాసెస్‌లో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాడు.
నాని గురించి?
నాని చాలా సహజంగా నటిస్తాడు. మంచి మనిషి. తను నటుడు మాత్రమేకాదు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. ఈ సినిమా ఒప్పుకునే వరకు తను నటించిన సినిమాలు చూడలేదు. ఆ తరువాత ‘ఈగ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం,’ ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాలు చూశాను. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
డ్రీమ్‌రోల్స్ ఏవైనా ఉన్నాయా?
కంగనారనౌత్ నటించిన ‘క్వీన్’, కాజోల్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’వంటి సినిమాల్లో నటించాలనుంది. ఇక అనుష్క అంటే చాలా ఇష్టం.. తనకు పెద్ద అభిమాని.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
తెలుగు, హిందీ భాషల్లో చర్చలు జరుగుతున్నాయి.

- శ్రీ