ఈనెలలోనే కళ్యాణ వైభోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఆడియో విడుదల నుండి వౌత్ టాక్‌తో మంచి పేరుతెచ్చుకున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి అభిషేక్ పిక్చర్స్‌వారు హక్కులను తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లిలాంటి బంధాలపై వున్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ చక్కగా అర్థమయ్యేలా కామెడీ, సంగీతం, భావోద్వేగాలను సరైన పాళ్లల్లో మేళవించి వాటి విలువలను చాటిచెప్పేలా రూపొందించిన చిత్రం ఇది. కథానాయకుల నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చాయని ఆయన అన్నారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్‌మదిరాజ్, తా.రమేష్, ధన్‌రాజ్, హేమంత్, స్నిగ్ధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్‌కోడూరి, కెమెరా: జి.వి.ఎస్.రాజు, ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి, మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్, నిర్మాత: కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.