మంచి సంగీతం కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది సాయికుమార్, రష్మి ముఖ్య పాత్రల్లో నటుడు పి.ప్రభాకర్ దర్శకత్వంలో వి4 మూవీస్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన చిత్రం నెక్స్ట్ నువ్వే. ఈ చిత్రానికి సంగీతం అందించాడు సాయి కార్తీక్. ఇటీవలే విడుదలైన ఈ పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం ఈనెల 18న విడుదలైన సందర్భంగా సాయి కార్తీక్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో ఉన్న రెండు పాటలు మంచి మెలొడీ సాంగ్స్‌గా రావడం ఆనందంగా వుంది, ప్రస్తుత సమయంలో మెలొడీ సాంగ్స్ చేయ డం అదృష్టంగా భావిస్తున్నాను, ఎందు కంటే చాలామంది సంగీత దర్శకులకు మెలొడీ సాంగ్స్ చేయాలని కోరిక ఉంటుంది, కానీ అవకాశాలు రావు, తాజాగా నాకీ అవకాశం దక్క డం సాంప్రదాయకరమైన వాయిద్యాలని వాడి పాటలను రూపొందించాను, హర్రర్ జోనరల్‌లో తెరకెక్కే చిత్రమైనా కూడా దర్శకుడు ప్రభాకర్ సంగీతానికి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. దాంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా అద్భుతంగా వచ్చింది, ఆది హీరోగా నటిస్తున్న ఈ సినిమా నాకు సంగీత దర్శకుడుగా మరింత మంచి గుర్తింపు వస్తుంది, ఈ సినిమాతోపాటు రవితేజ రాజా ది గ్రేట్ సినిమాకు సంగీతం అందిస్తున్నాను, మరో సినిమా చర్చల దశలో ఉంది అన్నారు.